New User Login ID:
Password:
Forgot Password
 
 
 
 
 
More Telugu Stories
KiCk (కితకితలు చక్కిలిగింతలు - 1) Author : KEY
(Posted on 13-Sep-2009) Rating :
Share with Friends Rated Users : 7
Close Story Premise
Premise :
అనగనగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు....రోజూ తిని, పని చేసి, తొంగుంటే మడిసి కి గొడ్డు కి తేడా ఉండదు అనుకుని వీలు చిక్కించుకుని అలా సరదాగా యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. అలా వెళితే సమస్య ఉండదు కానీ వెధవది లైఫ్ లో ఏ పని చేసినా కాస్త కిక్ ఉండాలని అంటూ ఉంటాడు. ఒకసారి అలానే ఒక విహార యాత్ర చేస్తాడు. అది కాస్తా బెడిసి కొట్టి సాహస యాత్ర గా ఎలా మారిందో చదవండి మరి.......
 
"అరేయ్.. అరున్నరయింది. ఏడింటికి ఎస్.ఆర్.నగర్ లో బస్ అంటే ఇప్పుడు బయల్దేరితే కాని అందుకోలేము" అంటూ శీను నన్ను తొందర పెట్టాడు.

"ఏడిశావులే. అన్నింటికి కంగారే. అయినా ఏడింటికి బస్సైతే ఇప్పటినుండి తొందరెందుకేహే. 6.55 కి బయల్దేరుదాం. అప్పుడుండే మజాయే వేరు. ఆ కిక్కే వేరు. లైఫ్ లో ఏం చేసినా కిక్కుండాలిరా. మూడు చేపల కథలో సుమతిలా కాకుండా కాలమతిలా ఉండటానికి ట్రై చేయరా బాబు" అంటూ నేను చేస్తున్న పనిని ఆపకుండా అన్నాను.

"నిన్ను కాదు రా.. ఆ కిక్ సినిమా తీసిన రవితేజ ని అనాలి. నీ కిక్కు తగలెయ్య. అవతల టైం అయిపోతోంది. అందరూ వచ్చేసుంటారు. కదలరా నీ...."

"ఆపెహే నీ సోది. నేనేమన్నా ఖాళీ గా కూర్చున్నానా? పన్లో ఉన్నా కదా.. అంత తొందరుంటే..నువ్వు పో.. నేనోస్తాలే." అన్నాను విసుగ్గా.

"సరే. బస్ మిస్సైతే అప్పుడుంటుoది నీకు." అని "6.45 అయింది వీడెప్పుడు కదులుతాడో..!" నసుగుతూ శీను వెళ్ళిపోయాడు.

నేను, శీను బేగంపేట లోని ఒక సాప్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్నాము... నెలకొకసారైనా సరదాగా ఏదో ఒక చోటకి విహారానికి వెళ్ళడం మాకు అలవాటు. అయితే ప్రతిసారీ మా ఆఫీసు వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. ఈ సారి శీను ఫ్రెండ్స్ పాపికొండలు ప్లాన్ చేసారు. తెలిసిన వాళ్ళతో వెళ్ళి వెళ్ళి కిక్కు దొబ్బింది(రవితేజ భాషలో) . తెలియని వాళ్ళతో వెళ్తే పిచ్చ కిక్కొస్తుందని ఓకే అన్నాను.

"6.50 అయింది. ఇప్పుడైనా కదలరా.." అంటున్న శీను గాడి నస భరించలేక "సరే పద" అని బయల్దేరి కిందకొచ్చాము.

"ఆటో.. ఎస్.ఆర్.నగర్ బస్ స్టాప్ కొస్తావా?" ఆటోని పిలిచాను.

"పచాస్ రుపయే"

"ఎక్కరా శీను" అన్నాను. శీను కంగారులో ఉన్నాడేమో... టక్కుమని ఎక్కేసాడు.

నేను ఎక్కాక.."అరేయ్.. పచాస్ అంటే పాతికే కదా. హైదరాబాద్ వచ్చాక ఇంత తక్కువ టైంలో హింది నేర్చుకుంది నేనొక్కడినే రా" గర్వంగా అన్నాను.

"నీ బొంద. అది పచ్చీస్..పచాస్ అంటే 50" శీను అదో టైప్ లో చూస్తూ అన్నాడు

"ఆటో..ఆపు.. మీటర్ వేస్తే 20 కూడా కాదు..50 ఎందుకు" అని అరిచాను.

ఆటో వాడు తాపీగా "తెల్గు నై మాలూం" అన్నాడు.

"మై పచాస్ నహి దేతా హై.. మ్..హూ....మ్.. తుం ఆటో రోకో హో..." మళ్ళీ అరిచాను.

ఆటో వాడు వెనక్కి తిరిగి ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. నాకేమి అర్ధం కాక శీను వైపు చూసాను. వాడు నా

మొహం మీద ఉమ్మలేక పక్కకి తిరిగి బయట ఉమ్మేసాడు.

"ఏమయింది రా? తప్పేమన్నా మాట్లాడానా? మై వచ్చినప్పుడు హూ.. తుం వచ్చినప్పుడు హో రావాలని హింది ఇన్ 30 డేస్ లో ఉంది. నేను కూడా ఆలానే వాడాను కదా" అడిగాను.

"తప్పేం లేదు రా. ఎవడైనా నేర్పితే నేర్చుకుంటే కిక్కుండదు. సొంతం గా నేర్చుకుంటేనే కిక్ అన్నావ్ గా.. ఏడువ్.." అని నా కిక్కు మీదున్న అక్కసు వెళ్ళగక్కాడు శీను.

కయ్యిమని శబ్దం తో ఆటో ఆగింది.

శీను వైపు తిరిగి భుజాలెగరేస్తూ "చూశావా.. నేను హింది లో చెప్పగానే ఆటో ఆపాడు" అని దిగి ముందుకు నడవబోయాను.

"పైసే దో" ఆటో వాడి గొంతు ఖంగు మంది.

"మై క్యోం పైసే దేతా హూ?" నేను కూడా రెట్టించాను.

"తుం ఎస్.ఆర్.నగర్ ఆతా హై. ఇస్లియే పైసే దేతా హై" శీను గాడు నన్ను అనుకరిస్తూ అన్నాడు.

మాటల్లో పడి ఎస్.ఆర్.నగర్ వచ్చేసామన్న సంగతి గమనించలేదు నేను. తప్పనిసరి పరిస్థితిలో యాభయ్ రూపాయలిచ్చాను. అయితే యాభయ్ పోయిందన్న బాధకన్నా శీను గాడు నన్ను ఎగతాళి చేసాడన్న బాధ ఎక్కువనిపించింది. దెబ్బకి దెబ్బ తీయాలన్న పట్టుదలతో అదను కోసం చూస్తున్నాను.

ఇంతలో శీను ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ పలకరింపులయ్యాక "ఇతను కిరణ్" అంటూ నాకు పరిచయం చేసాడు.

"హాయ్.. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదేంటి..బస్ టైం అయింది కదా" అనుమానంగా అడిగాను.

"ఏడున్నర కి కదా బస్. మెల్లగా వస్తారు లే" అన్నాడు కిరణ్.

"ఏడున్నర కా!!?? ఏడింటికన్నాడు శీను!!??? శీను గాడు నన్ను ఫూల్ చేసాడు" నాలో నేనే అనుకున్నాను.శీను మీద ఇంకా మంట పెరిగిపోయింది నాకు.

ఇంతలో శివ అని ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు. శీను అతన్ని పరిచయం చేశాడు.

నేను నా పేరు చెప్పబోతుండగా.."నాకు తెలుసు" అన్నాడు.

"ఎలా?" ఆశ్చర్యం గా చూసాను

"నిన్ను చూస్తే చెప్పేయచ్చు. నీ పేరు మహేష్ బాబు" అన్నాడు.

"కాదు బాస్. నా పేరు.."

"నువ్వలాగే ఉన్నావు మామా. మేము అదే ఫిక్స్ అయిపోతాము" అన్నాడు చనువుగా శివ.

లోపల తొలిప్రేమ లో పవన్ కళ్యాణ్ లా పక్కకెళ్ళి గంతులేద్దాం అన్నంత ఆనందంగా ఉన్నా పైకి మాత్రం "నువ్వు మరీ చెప్తావు మామా" అంటూ నేను కూడా సరదాగా మాట దాటేశాను.

ఒక్కొక్కళ్ళు గా శీను ఫ్రెండ్స్ రావడం మొదలెట్టారు. అనూప్, సాయి శ్రీనివాస్..ఇలా పరిచయాలు అవుతున్నాయి.

శీను ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. నేను, శీను కాకుండా ఎనిమిది మంది ఉన్నారు. అంటే మొత్తం పది మంది అయ్యాము.

అందరిలో నాకు నచ్చినవాళ్ళు మాత్రం శివ, ఇందర్ పాల్ సింగ్ అని ఒక సర్దార్. ఎందుకంటే ఒకడేమో మహేష్ అన్నాడు. ఇంకొకడేమో హిందీ వాడు. ఈ ట్రిప్ అయ్యేలోగా వాడి దగ్గర హింది నేర్చేస్కోవచ్చు కదా. 'మై' లు, 'తుం' లు, 'హూ' లు, 'హో' లు కరెక్ట్ గా పట్టేయాలి అనుకున్నా.

ఇంతలో రాజమండ్రి బస్సు రాగానే అందరం బిల బిల మంటూ బస ఎక్కేశాము. మరుసటి రోజు పాపికొండలు కి బోటు ప్రయాణం, గోదావరి మధ్యలో కొండలలో బస, వాటిలో ఉండే కిక్కు తలుచుకుంటూ నిద్ర లోకి జారుకున్నాను.

(సశేషం)
 
 
Please login to post your comments. Report Abuse
కథనం చాలా బాగుంది. చదువుతున్నంత సేపు నేను కూడా సీన్ లో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది. ఈ మధ్య ఇంత బాగా కథనం నడిపించిన కథ ఎక్కడా కనపడలేదు. థాంక్స్ ఫర్ సచ్ ఎ గుడ్ సీరియల్.          
Harita
(10/2/2009)
 
బాగుంది.          
Deepak Sharma Ch
(9/20/2009)
 
కథ చాలా బాగుంది...బాగా కిక్ వచ్చింది చదివినప్పుడు..         
Rajitha
(9/15/2009)
 
కిక్ కాకుండ వెరె పదమ్ వాడుంటె ఇంక కిక్ ఉండెడి          
RV
(9/14/2009)
 
కథ చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ ఒక క్వశ్చన్. ఈ సైట్ లో రిజిస్టర్ అవటానికి అడ్రెస్స్ ఎందుకు కంపల్సరీ!!!!?????         
Shilpa Reddy
(9/13/2009)
 
సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావు... లేటెస్ట్ మూవీస్తో బాగానే ట్రై చేసావు... ఇంతకి ఆ శీనుగాడిపై కసి తీర్చుకున్నావా? లేదా? next part కోసం waiting...         
RaMo
(9/13/2009)
 
మాకు కూడ కిక్ రావాలి కదా, తొందరగ మిగత భాగాలు పోస్ట్ చెయ్యు.......         
SruthaKeerthi
(9/13/2009)
 
Author Details
 
About author
 
Other Stories from Author
 
 
This page is best viewed in IE 6 (and above) and Firefox 3 (and above).
Check our FAQ section for more information on whats and hows.